విశాఖజిల్లా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి పుస్తకాలు కాలిబూడిదైయ్యాయి.అంబేద్కర్ స్టడీ సెంటర్ లో ఉన్న పుస్తక విభాగం తలుపులు తెరిచి చూసేసరికి పుస్తకాలు మంటలకు ఆహుతవుతున్నాయని సిబ్బంది తెలిపారు.హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించటంతో సకాలంలో చేరుకొని మంటలను అదుపు చేశారు.కళాశాల ప్రారంభమయ్యే సమయంలో ఈ ఘటన జరగటంతో నష్టం తగ్గిందనీ,అర్ధరాత్రి జరిగి ఉంటే పరిస్థితి చేయిదాటి ఉండేదని కళాశాల సిబ్బంది పేర్కొన్నారు.
కళాశాలలో షార్ట్‌సర్క్యూట్, తప్పిన ప్రమాదం - fire accident at paderu
విశాఖ ఏజెన్సీ పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కొన్ని పుస్తకాలు దగ్ధమయ్యాయి.
![కళాశాలలో షార్ట్‌సర్క్యూట్, తప్పిన ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4476224-632-4476224-1568792129933.jpg)
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
TAGGED:
fire accident at paderu