ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మల్లవరంలో అగ్నిప్రమాదం.. 14 పాడి పశువులు సజీవదహనం - విశాఖ జిల్లాలో అగ్ని ప్రమాద వార్తలు

విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్నిప్రమాదంలో 14 పాడి పశువులు సజీవదహనమయ్యాయి. రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు.

fire accident
మల్లవరంలో అగ్నిప్రమాదం

By

Published : May 6, 2021, 8:34 AM IST

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం మల్లవరం సమీపంలోని పశువుల పాకలో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో 14 పాడి పశువులు సజీవదహనమయ్యారు. గ్రామానికి చెందిన మిడతల రామచంద్రరావు అనే రైతు పశువుల పాకలో ఈదురుగాలులతో విద్యుత్ తీగలు తెగి షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు.

ABOUT THE AUTHOR

...view details