ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్యాస్ లీక్​తో చెలరేగిన మంటలు.. రెండు దుకాణాలు దగ్ధం - విశాఖ జిల్లా రావికమతం మండలంలో అగ్ని ప్రమాదం

గ్యాస్ లీకు కావడంతో జరిగిన ప్రమాదంలో రెండు దుకాణాలు దగ్ధం అయ్యాయి. ఈ సంఘటన విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోటలో జరిగింది. హోటల్​లో టీ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న కిరాణ దుకాణానికి మంటలు అంటుకున్నాయి.

fire accident at kothakota
రావికమతం మండలం కొత్తకోటలో అగ్నిప్రమాదం

By

Published : Mar 26, 2021, 7:53 PM IST

విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోటలో గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని హోటల్​, కిరాణ దుకాణాలు పక్కపక్కనే ఉన్నాయి. హోటల్​లో టీ చేస్తుండగా గ్యాస్ నుంచి మంటలు ఎగిసిపడడంతో అంతా బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో హోటల్​తో పాటు పక్కనే ఉన్న కిరాణ దుకాణం పూర్తిగా కాలిపోయింది.

కిరాణ దుకాణంలోని పలు విద్యుత్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. వీటితోపాటు కొన్ని ముఖ్యమైన పత్రాలు మంటల్లో బూడిద అయిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు యజమానులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details