Trials on INS Vikrant were successful: ఐఎన్‌ఎస్ విక్రాంత్ మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసుకుంది. భారత నౌకాదళానికి చెందిన తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్, మిగ్ 29 తొలి ప్రయత్నంలోనే విక్రాంత్‌పై ల్యాండింగ్, టేకాఫ్‌లను విజయవంతంగా పూర్తి చేశాయి. దేశీయంగా తయారై.. ఎయిర్ క్రాఫ్ట్‌లను మోసుకుపోగల ఈ ప్రతిష్టాత్మక యుద్ధనౌక ఇప్పుడు వివిధ దశల్లో తన సన్నద్ధతను ప్రపంచానికి తెలియజేస్తోంది.
ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌకపై కీలక యుద్ధ విమానాల విన్యాసాలు విజయవంతం
Trials on INS Vikrant were successful: దేశీయంగా తయారైన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై.. భారత నౌకాదళానికి చెందిన తేలికపాటి యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్‌లను విజయవంతంగా పూర్తి చేశాయి. దీంతో మరోసారి భారత్ సత్తా ప్రపంచానికి తెలియజేసినట్లు అయింది.
ఆరేబియా సముద్ర జలాల్లో ఉన్న విక్రాంత్ నౌకపై వీటిని నిర్వహించారు. భారత నౌకాదళానికి చెందిన విమాన పైలట్లు యుద్ధ విమానాలను విక్రాంత్ పైనుంచి గగన తలానికి వెళ్లి, తిరిగి గగన తలం నుంచి యుద్ధనౌకపైకి విజయవంతంగా చేరుకున్నాయి. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా తయారైన యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల సామర్ధ్యాన్ని దీనిద్వారా మరోసారి చాటి చెప్పారు. దేశీయంగా యుద్ధనౌకలు, యుద్ధ విమానాల రూపకల్పన, అభివృద్ది , నిర్మాణం, నిర్వహణ వంటివి చేయగలిగే సత్తా భారత్‌కు ఉందన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిందని నౌకాదళం వెల్లడించింది.
ఇవీ చదవండి: