కన్న కుమార్తె (14)పైనే అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటన విశాఖలో జరిగింది. బాలిక అస్వస్థతకు గురికావటంతో వైద్యుల తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది. నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు.
విశాఖ రైల్వేన్యూకాలనీలో బాధిత బాలిక, తండ్రి, నానమ్మ, తాతయ్య కలిసి ఉంటున్నారు. తల్లి ఇటీవలే చనిపోయింది. బాలికకు మాయమాటలు చెప్పి ఐదు నెలలుగా ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లగా బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధరణైంది. ఈ సంఘటనతో వైద్యులు నిర్ఘాంతపోయారు. వెంటనే నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దిశ పోలీస్‌స్టేషన్ ఏసీపీ ప్రేమ్‌కాజల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.