విశాఖ పెందుర్తి చిన్నముసిడివాడలో కుటుంబ కలహాలతో తండ్రి వీర్రాజు (70) కుమారుడు జల రాజు (40) ను సుత్తితో కొట్టి హత్య చేశాడు. అనంతరం పెందుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
మృతుడు మర్చంట్ నావీ ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.