ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో.. తండ్రిని హత్య చేసిన కొడుకు - విశాఖ జిల్లా తాజా క్రైమ్ వార్తలు

కని పెంచిన తండ్రిని మద్యం మత్తులో కడతేర్చిన ఘటన విశాఖ ఏజెన్సీలోని ఏనుగు రాయిలో చోటు చేసుకుంది. కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

father dead because of his son beat with stick
కొడుకు చేసిన దాడిలో ప్రాణాలు విడిచిన తండ్రి

By

Published : Mar 31, 2021, 11:15 AM IST

విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం ఏనుగు రాయిలో.. దారుణం జరిగింది. కొడుకు చేతిలో తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో తండ్రి సూరిబాబుతో కుమారుడు ప్రసాద్​ వాగ్వాదానికి దిగాడు. ఆ మత్తులో కర్ర తీసుకొని.. తండ్రి తలపై బలంగా కొట్టాడు. ఒక్కసారిగా సూరిబాబు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సంఘటన జరిగిన ప్రాంతంలోనే సూరిబాబు ప్రాణాలు విడిచాడు. కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details