విశాఖ జిల్లా సబ్బవరంలో విషాదం జరిగింది. తమ కుమారుడు సర్పంచ్‌గా గెలుస్తాడో లేదో అని.. తండ్రి, సర్పంచ్ అభ్యర్థి సోదరి గుండెపోటుతో మరణించారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం నారపాడు పంచాయతీ ఎన్నికల్లో.. మామిడి శంకర్ రావు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. శంకర్ రావు గెలుపు కోసం అతని తండ్రి అప్పారావు, సోదరి గంగాభవాని విస్తృతంగా ప్రచారం చేశారు.
ప్రాణాలు తీసిన పంచాయతీ ఎన్నికల ఫలితాల 'ఉత్కంఠ'..! - పంచాయతీ ఎన్నికల ఉత్కంఠతో తండ్రీ కుమార్తె మృతి వార్తలు
కుమారుడు సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడ్డాడని ఎంతో పొంగిపోయాడా తండ్రి. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తున్న కుమారుడిని వెన్నంటి ఉండి.. ప్రచారంలో హుషారుగా పాల్గొన్నాడు. తన సోదరుడు విజయతీరాలకు చేరుకునేందుకు తనవంతు కృషి చేయాలని.. సోదరి సైతం ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంది. సరిగ్గా పోలింగ్ జరిగే సమయానికి.. తన కుమారుడు గెలుస్తాడో.. లేదో అని.. తన సోదరుడిని గ్రామ సర్పంచ్‌గా చూస్తానో.. లేదో అన్న అనుమానం వచ్చింది ఇద్దరికీ. అంతే ఆ తండ్రీ కుమార్తెలిద్దరూ.. అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు.

పోలింగ్ జరుగుతున్న రోజు శంకర్ రావు గెలుస్తాడో.. లేదో అని ఉత్కంఠకు గురైన.. అప్పారావు, గంగాభవాని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గమనించిన కుటుంబసభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. ఈరోజు ఇద్దరూ గుండెపోటుతో మరణించారు. ఎన్నికల్లో సర్పంచ్‌గా శంకర్ రావే గెలిచారు. తన గెలుపు కోసం పరితపించిన ఇద్దరూ.. తన విజయాన్ని చూడకుండానే మరణించారని.. శంకర్ రావు కన్నీరుమున్నీరయ్యారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ.. శంకర్ రావు ఇంటికి వెళ్లి, కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఇదీ చదవండి:ఆర్‌ఓలు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్