స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటనకు వ్యతిరేకంగా వంద రోజులుగా నిర్విరామ దీక్షలు చేస్తున్న కార్మికులకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉందని అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల నేతలు అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. విశాఖ జీవీఎంసీలోని గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాల జేఏసీ నేతృత్వంలో రిలే నిరాహర దీక్షలు జరుగుతున్నాయి.
కొవిడ్ సమయంలో వేలాదిమంది ప్రాణాలు కాపాడుతున్న స్టీల్ ప్లాంట్‌పై కేంద్రానికి కొంచెం కూడా కనికరం లేదని… సంస్థను ప్రైవేటు పరం చేసి తీరాలనే ఆలోచనతో ప్రధాని ముందుకెళ్తున్నారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణపై కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ కార్యదర్శి కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. మోదీకి భజన చేయడం మానేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.