విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారం పరిధిలో చెరుకు నాట్లు వేసే కార్యక్రమం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కర్మాగారం మెట్టు భూమి అధికంగా ఉండటంతో జూలై నెల వరకు చెరకు నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఒంటికన్ను మచ్చలున్న ఒక్కొక్క చెరుకుపై 85 పైసల రాయితీని చక్కెర కర్మాగారం చెల్లించినట్లు యాజమాన్య సంచాలకులు వి. సన్యాశినాయుడు తెలిపారు. ఈ ఏడాది 28 లక్షల మొక్కలను రైతులకు అందజేసినట్లు చెప్పారు.
గోవాడలో చెరుకు నాట్లు ప్రారంభించిన రైతులు
గోవాడ చక్కెర కర్మాగారం చుట్టు పక్కల ప్రాంతాల్లో చెరుకు నాట్లను రైతులు వేయడం ప్రారంభించారు. ఒంటికన్ను మచ్చలున్న చెరుకు అసలు ధర రూ 1.75 పైసలు. ఈ ధరలో 85 పైసలను చక్కెర కర్మాగారం యాజమాన్యం చెల్లిస్తున్నట్లు తెలిపారు. వీటిని 350 ఎకరాల్లో నాటినట్లు యాజమాన్య సంచాలకులు వి. సన్యాశినాయుడు తెలిపారు.
చెరుకు నాట్లు వేస్తున్నరైతులు