ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాకు భయపడితే యూరియా దొరకదు... పంట దక్కదు - విశాఖలో యూరియా కష్టాలు

విశాఖ జిల్లాలో యూరియా అరకొరగా లభించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక బస్తా యూరియా కోసం రైతులు సొసైటీల వద్ద గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్నా.. యూరియా కోసం భయాన్ని వీడి.. పంటలను రక్షించుకునేందుకు రైతులు ఆరాట పడుతున్నారు.

farmers rushed for urea at vishaka district
యూరియా కోసం క్యూ కట్టి న రైతులు

By

Published : Sep 3, 2020, 12:24 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం ఎం.అలమండలోని వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. ఉదయం నుంచే కార్యాలయం ఎదుట బారులు తీరారు. ఒకరికి కేవలం ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇస్తుండటంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూరియా నిల్వలు సైతం తక్కువగా ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో... రైతులు పెద్దగా పోటెత్తడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. అధికారులు స్పందించి అవసరమైన మేరకు ఎరువులు పూర్తి స్థాయిలో అందించాలని రైతులు కోరుతున్నారు.

యూరియా కోసం క్యూ కట్టి న రైతులు

ABOUT THE AUTHOR

...view details