విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం పరిధిలోని శారదా నదిపై ఉన్న తారువ ఆనకట్టు నుంచి పొలాలకు సాగునీరు అందిస్తున్న కుడికాలువ వర్షాలకు పూడిపోయింది. దీంతో ఆయకట్టు పరిధిలోని పొలాలకు సాగునీరు అందట్లేదని... రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం పంట దిగుబడికి వస్తున్నందున... నీటి సమస్యలు తలెత్తుతాయని వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవడంతో... చేసేదిలేక బి.కింతాడ, కలిగొట్ల, తిమిరాం రైతులు, నాయకులు, గ్రామ పెద్దలు సమష్టిగా శ్రమదానం చేయాలని నిర్ణయించుకున్నారు. రైతులు శారదా నదిపై ఉన్న తారువ ఆనకట్టు నుంచి కుడికాలువ చివరి వరకు పూడిక తీశారు. రైతులు శ్రమదానంలో పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. కాలువను బాగు చేసుకున్నారు.
రైతుల శ్రమదానం.. బాగుపడిన సాగునీటి కాలువ
విశాఖ జిల్లా రైవాడ జలాశయం పరిధిలో వర్షాలకు కుడికాలువ పూడికపోయింది. నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులకు తెలుపగా వారు పట్టించుకోలేదు. మట్టిని తొలగించడానికి ఆయకట్టు పరిధిలోని బి.కింతాడ, కలిగొట్ల, తిమిరాం గ్రామాలకు చెందిన రైతులు శ్రమదానంలో పాల్గొని..పూడికతీశారు. కాలువలను బాగుపరుచుకున్నారు.
రైతుల శ్రమదానం