ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక కోసం 150 ఎడ్ల బండ్లతో రోడ్డెక్కిన రైతులు - నాతవరం రైతుల ఆందోళన

ఇసుక రవాణా చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ... విశాఖ జిల్లా నాతవరంలో రైతులు ఆందోళనకు దిగారు. 150 ఎడ్ల బండ్లతో రహదారిని దిగ్బంధించారు. వీరి నిరసనకు అధికారి పార్టీ నేత నాయకత్వం వహించడం విశేషం.

farmers-protested-with-150-bullock-carts-in-vishaka-district
farmers-protested-with-150-bullock-carts-in-vishaka-district

By

Published : Feb 15, 2020, 7:26 PM IST

ఇసుక కోసం 150 ఎడ్ల బండ్లతో రోడ్డెక్కిన రైతులు

అధికారులు తమ పొట్ట కొడుతున్నారంటూ... విశాఖ జిల్లా నాతవరంలో రైతులు ఆందోళనకు దిగారు. సుమారు 150 ఎడ్లబండ్లను రోడ్డుపై నిలిపి నిరసన వ్యక్తం చేశారు. నాతవరంలోని రైతులు స్థానిక నదిలోని ఇసుకను ఎడ్లబండ్లతో సరఫరా చేస్తూ జీవనం సాగించేవారు. కొన్ని నెలల నుంచి ఇసుక రవాణాకు వీరికి అధికారులు అనుమతులు ఇవ్వడంలేదు. శనివారం స్థానిక నది నుంచి సుమారు 150 ఎడ్ల బండ్లతో ఇసుక తరలించే ప్రయత్నం చేశారు. వారు రోడ్లపైకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన రైతులు ఎడ్ల బండ్లతో నాతవరం రహదారులను దిగ్బంధించారు. వీరి ఆందోళనకు మండల వైకాపా నాయకుడు అంకిరెడ్డి జమీల్ నాయకత్వం వహించారు. ప్రభుత్వం దృష్టికి రైతుల సమస్యను తీసుకెళ్లేందుకే ఈ ఆందోళన చేశామని ఆయన తెలిపారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది జోక్యం చేసుకుని... సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని రైతులకు నచ్చజెప్పారు.

ఇదీ చదవండి
భారత 'బోల్ట్'​కు శాయ్​లో శిక్షణ.. ఒలింపిక్స్​ కోసమేనా!

ABOUT THE AUTHOR

...view details