ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటోన్న భూములను ప్రభుత్వం తీసుకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని విశాఖ జిల్లా మునగపాక మండలం ఒంపోలులో రైతులు వాపోయారు. గ్రామంలోని గడ్డ పోరంబోకు భూముల్లో లేఅవుట్ వేయడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. పెట్రోల్ చేత పట్టుకొని పొలాల్లో కూర్చున్నారు. పేదలకు ఇవ్వడానికి తమ భూములు లాక్కుంటే ఎలా అని వాపోయారు. వీటిపైనే ఆధారపడి తాము బతుకుతున్నామని అన్నారు.
పెట్రోల్ చేత పట్టుకుని పొలాల్లో కూర్చున్న రైతులు - farmers protest with petrol in visakha district
విశాఖ జిల్లా ఒంపోలులో ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ కోసం పోరంబోకు భూములను సేకరిస్తోంది. వీటిని స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. పెట్రోల్ చేత పట్టుకుని పొలాల్లో కూర్చున్నారు. గత 35 ఏళ్లుగా ఇక్కడ భూములు సాగు చేసుకుంటున్నామని వాటిని తీసుకుంటే ఎలా అని వాపోయారు.

అడ్డుకున్న ఒంపోలు రైతులు