ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నగదు రహిత లావాదేవీల వైపు.. అన్నదాతల అడుగులు - అన్నదాతల ఆన్​లైన్​ లావా దేవీలు న్యూస్

కరోనా సమయంలో రైతుల ఆరోగ్య భద్రత దృష్ట్యా నగదు రహిత లావాదేవీ పద్ధతులను విశాఖ వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తోంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతు భరోసా కేంద్రాల ద్వారా డిజిటల్ పేమెంట్ విధానంతో వివిధ వ్యవసాయ సామగ్రిని పొందే సౌకర్యం కల్పిస్తున్నారు. నగదు రహిత విధానాల కోసం గ్రామీణ రైతులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు.

నగదు రహిత లావాదేవీల వైపు.. అన్నదాతల అడుగులు
నగదు రహిత లావాదేవీల వైపు.. అన్నదాతల అడుగులు

By

Published : Aug 30, 2020, 12:33 AM IST

ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడటం విశాఖ జిల్లా వ్యవసాయ రైతులకు సంతోషాన్నిచ్చింది. రైవాడ, తాండవ, సీలేరు, జలాశయలు నిండా నీళ్లు ఉండటం రైతులకు మరింత మేలు చేస్తోంది. ఇప్పటికే రైతుభరోసా పథకంతో.. రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, పురుగుమందులు ఇతర వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను ప్రభుత్వం అందిస్తోంది. వీటికోసం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నగదు లావాదేవీలు జరుగుతుంటాయి. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా.. జిల్లాలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. జిల్లా వ్యవసాయ శాఖ.. నగదు రహిత లావాదేవీలు జరిగేలా చేస్తూ.. రైతులకు మేలు చేస్తోంది. ఈ విధానాన్ని అందరూ రైతులు అలవాటు చేసుకోవాలని.. అవగాహన కోసం సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను సందర్శించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details