చేతికొచ్చిన పంట ఆకాల వర్షాలతో చేజారిపోయే - havy rains in visakha latest news update
విశాఖలో ఆకాలంగా కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట పూర్తిగా నేలపాలు కావడం రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
విశాఖలో అకాల వర్షాలకు నేలవాలిన పంట
విశాఖ జిల్లాలో బుదవారం కురిసిన అకాల వర్షానికి ఉద్యానవన పంటలు నేలపాలయ్యాయి. పాయకరావుపేట నియోజకవర్గ౦లో ప్రధాన పంటలైన అరటి, తమలపాకు, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈదురు గాలుల తాకిడి కి విద్యుత్ స్థ౦భాలు నేల వాలయి. పంట చేతికొచ్చిన సమయంలో కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వాపోతున్నారు.
ఇవీ చూడండి...