సాధారణంగా ఉద్యానవన పంటలకు సంబంధించి పూలు, పండ్ల సాగులో ఉభయగోదావరి జిల్లాలు ముందుంటాయి. అదే తరహాలో విశాఖ జిల్లా గొలుగొండ మండలం లింగంపేట గ్రామానికి చెందిన రైతులు పలు పండ్ల జాతుల పెంపకంపై దృష్టి సారించారు. గ్రామానికి చెందిన వంగల లక్ష్మీ, ఆమె భర్త రమణ పండ్ల పెంపకంపై ఆసక్తితో విజయం సాధించారు.
మిగితా రైతులకు స్ఫూర్తిగా నిలిచారు. తమ పెరటిలోని అరటి తోటలో సుమారు 3 అడుగుల పొడవైన అరటి గెల పడింది. ఈ గెలకు 450కి పైగా అరటి పళ్లు ఉన్నట్లు గుర్తించగా... అరుదైన ఈ భారీ అరటికాయలను తిలకించడానికి చుట్టుపక్కల ప్రజలు తరలివస్తున్నారు. ఇది మార్కెట్లో రూ.800 పైగా ఉంటుందని రైతులు అంచనా వేస్తున్నారు.