తాండవ జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు... న్యాయం చేయాలని కోరుతూ విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ సమీపంలోని మాధవనగర్ నిర్వాసితులు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయానికి వినతిపత్రం అందించారు.
జలాశయం నిర్మాణంలో భూములు పోయిన సుమారు 150 మందికి మాత్రమే పట్టాలిచ్చారని... మిగిలిన వారికి ఇవ్వలేదని వాపోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వచ్చిన రైతు భరోసా, విత్తనాలు, ఎరువులు తదితర రాయితీలను పొందలేకపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.