విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన రబీ వరి పంట మునిగింది. ధాన్యం పంట పొలాల్లో మొలకెత్తాయి ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట కాస్తా నీటిపాలైందని రైతులు వాపోతున్నారు. ఎలమంచిలి రాంబిల్లి అచ్యుతాపురం మునగపాక మండలంలో 5 వేల ఎకరాల్లో వరి పంటకు అపార నష్టం జరిగింది. తడిచిపోయిన పంటలను గట్ల పైకి తెచ్చి రైతులు ఆరబెడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పొలాల్లో పర్యటించి పంట నష్టాలను అంచనా వేస్తున్నారు.
అకాల వర్షం.. రైతన్నకు మిగిల్చింది శోకం - యలమంచిలిలో అకాల వర్షం
విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో అకాల వర్షం రైతన్నను నట్టేట ముంచింది. చేతికొచ్చిన పంటను నీట ముంచి శోకమే మిగిల్చింది. ప్రభుత్వం స్పందించి వారికి నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
![అకాల వర్షం.. రైతన్నకు మిగిల్చింది శోకం farmers affected with rain in yalamanchili](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6981823-161-6981823-1588128900401.jpg)
యలమంచిలిలో నీట మునిగిన వరి