విశాఖ జిల్లా మాడుగుల మండలం సాగరం గ్రామానికి చెందిన రైతు.. పాము కొండలరావు గురువారం సాయంత్రం చెరువులో ఉన్న పశువులను ఒడ్డుకు తోలుకురావడానికి తానూ చెరువులో దిగాడు. నీరు ఎక్కువగా ఉండటంతో చెరువులో గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది ఎంత గాలించినా.. ఆచూకీ లభ్యం కాలేదు. ఈ మేరకు శుక్రవారం మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు. రైతు కొండలరావు మృతదేహం లభించింది. కేసు నమోదు చేసి.. పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై రామారావు తెలిపారు.
చెరువులో గల్లంతైన రైతు మృతదేహం లభ్యం - విశాఖజిల్లా వార్తలు
విశాఖ జిల్లా సాగరం గ్రామ సమీపంలోని చెరువులో గల్లంతైన రైతు పాము కొండలరావు మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
farmer died