ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmer died in clash: బకాయిల విడుదల కోరుతూ చేపట్టిన ధర్నాలో తోపులాట.. రైతు మృతి - protest at sugar factory in Visakhapatnam

విశాఖపట్నం జిల్లాలోని తాండవ చక్కెర కర్మాగారం వద్ద బకాయిలు విడుదల చేయాలని కోరుతూ అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో జరిగిన తోపులాటలో ఓ రైతు చనిపోయారు.

ధర్నాలో సోమ్మసిల్లిపడిపోయిన రైతు
ధర్నాలో సోమ్మసిల్లిపడిపోయిన రైతు

By

Published : Dec 24, 2021, 11:19 AM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట తాండవ చక్కెర కర్మాగారం రైతులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ.. అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. విజయవాడ- విశాఖపట్నం 16వ నంబర్ జాతీయ రహదారిపై రైతులు, కార్మికులు బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేయగా.. ఒక్కసారిగా జరిగిన తోపులాటలో అర్జున్ రావు రైతు సొమ్మసిల్లి పడిపోయాడు. అతన్ని హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సుభద్రంపేట చెందిన రైతుగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details