Irregularities in Bhimili Constituency Voter List: విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని పలు గ్రామాల ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంటి నంబరు తప్పుగా ఉందన్న కారణాన్ని చూపించి అర్హులైన వారికి ఓటు హక్కు దూరం చేసేందుకు, బోగస్ ఓటర్లకు అవకాశం కల్పించేందుకు ఉద్దేశపూర్వకంగానే జాబితాలో అక్రమాలకు తెరలేపారని స్పష్టం అవుతోంది. కొన్ని చోట్ల అసలు ఆ గ్రామాలతో సంబంధం లేని ఓటర్లను జాబితాలో చేర్చారు. గుర్తించిన తప్పులను సరిదిద్దేందుకు ఓటర్ల నుంచి సంబంధిత అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.
Fake Voters List in Bheemili : '0.. 00.. 000..' ఇవన్నీ ఇంటి నెంబర్లే! భీమిలిలో వెలుగులోకి నకిలీ ఓటర్ జాబితాలు Telugu Desam Party fire on stolen votes: తప్పుల తడకగా ఓటర్ల జాబితా.. భారీగా దొంగ ఓట్లు..!
పద్మనాభం మండలం నేరళ్లవలస గ్రామంలోని ఓటరు లిస్టులో ఒకే ఇంటి నంబర్లతో పదుల సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ఇంటి నంబరు 00 చిరునామాతో పుల్లా సాధమ్మ, మాధవీ లత, సత్య గరికిన, ఏలియా రాజు చక్కల, దుర్గ, పైడిరాజు గుడ్ల, రాజు పడాల, వంశీ గరికిన, సందీప్ గరికిన, ఎల్లాజీ గరికిన, విఘ్రేష్ గుల్లా, లక్ష్మీకాంత్ సత్తిరాజు, పర్వీవుల్లా తదితర పేర్లు ఉన్నాయి. ఇంటి నంబరు 000 చిరునామాతో కొన్ని పేర్లున్నాయి. అసలు ఇంటి నంబరే లేకుండా ఏడు పేర్లున్నాయి. కొందరు ఓటర్లు ఉన్నప్పటికీ వారు చిరునామాగా పేర్కొన్న ఇంటి నంబర్లు (House Numbers) మాత్రం తప్పు.
YCP Removing TDP Votes: అనుకూలమైతేనే ఓటర్ల జాబితాలో పేరు.. ఇదే అధికార పార్టీ తీరు
Votes Deletion in AP: కోరాడ గ్రామంలోని ఆరు వీధుల్లో 13వందల ఓటర్లు ఉన్నారు. అందులో మూడు వందల మంది ఓటర్లకు ఇంటి నంబరు 1-1గా ఉంది. గత సంవత్సరం నవంబరు 9 నుంచి ఈ సంవత్సరం జనవరి 5వ తేదీ మధ్య కొత్తగా చేరిన ఓటర్లకు కూడా అవే ఇంటి నంబర్లు ఇచ్చారు. పద్మనాభం మండలం బర్లవాని కళ్లాలుకు చెందిన సురేశ్ బర్ల కొత్తగా ఓటరుగా చేరాడు. ఇతని ఇంటి చిరునామా 2-184 కాగా ..ఓటరు కార్డులో 1-1గా చూపించారు.
Fake votes: ఇల్లే లేదు.. అయినా 103 ఓట్లు.. అడ్డగోలుగా ఓటర్ల నమోదు
పద్మనాభం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కోయ సూరీడు, కోయ పైడిరాజు తండ్రీకొడుకులు. ఇంటి నంబరు 2-65లో నివాసం ఉంటున్నారు. పైడిరాజుకు ఇటీవలే ఓటు హక్కు లభించింది. ఓటరు జాబితాలో ఆయన అడ్రస్ కాలమ్ వద్ద ఇంటి నంబరు 1-1గా పేర్కొన్నారు. అదే జాబితాలో పైడిరాజు తండ్రి సూరీడు పేరున్న చోట ఇంటి నంబరు 2-65గా పొందుపరిచారు. ఒకే గ్రామంలో ఒకే ఇంట్లో ఉంటున్న తండ్రీకొడుకుల విషయంలోనే ఇంటి నంబర్లు ఇలా తప్పులతడకగా నమోదు చేశారు.
Bogus Votes in AP: ఇబ్బడిముబ్బడిగా బోగస్ ఓట్లు.. ఏ బూత్ చూసినా అవే
Fake Votes in Andhra Pradesh: కోరాడ గ్రామ ఓటర్ల జాబితాలో స్థానికంగా ఎప్పుడూ నివసించని, అసలు ఆ ఊరితో (Village) సంబంధం లేని పలువురిని ఓటర్లుగా చేర్చారు. అమ్నాఖాన్, మహ్మద్ సుహైల్ అస్రఫ్ ఖాన్ , మహ్మద్ రెహాన్ ఖాన్ వీరు స్థానికులు కారు. చాలా ఏళ్ల కిందట కోరాడలో స్థలాలు కొని విక్రయించేశారు. అయినప్పటికీ వారిని ఇంటి నంబరు ‘‘00’’గా పేర్కొని జాబితాలో ఓటర్లుగా చేర్చేశారు.
Magic of house numbers in Guntur : 'గుంటూరు కార్పొరేషన్' మాయాజాలం..! ఇంటి నంబర్లు డబుల్.. భారీగా దొంగ ఓట్లు
కోరాడ గ్రామ ఓటర్ల జాబితాలో మారుబర్కీ రామారావు అనే పేరు ఉంది. ఈయన తండ్రి పేరు రాములమ్మగా పేర్కొన్నారు. ఓ మహిళ పేరు తండ్రి పేరు ఎలా అవుతుందో ఎన్నికల అధికారులకే తెలియాలి. అసలు రామారావు అనే పేరుతో ఆ ఊర్లోనే ఎవరూ ఉండటం లేదు. స్థానికులకు అతనెవరో తెలియదు. ఇలాంటివి చాలా ఓట్లు ఉన్నాయి. మృతిచెందిన వారి ఓట్లను తొలగించాల్సి ఉండగా సుమారు 40 వరకు తొలగించలేదు. ఈ ముసుగులో బోగస్ ఓట్లు వేసేందుకే ఇలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
వెంకటాపురంలో వసాది తులసీ బంగారుబాబు తండ్రి రామారావు పేరుతో వరుస సంఖ్య 139తో ఇప్పటికే ఓటరు కార్డు ఉంది. అవే వివరాలు ఆధారంగా తులసీ వనరి పేరుతో ఒక మహిళ చిత్రంతో ఇక్కడ ఓటరు జాబితాలో కొత్త ఓటు చేర్చారు. తండ్రి పేరు స్థానంలో రామారావు అనే పేరు భర్తగా చూపించారు.
Fake Votes in Vijayawada: ఒకే ఇల్లు.. ఆరుగురు ఉంటే 48 ఓట్లు.. తప్పులతడకగా ఓటరు జాబితా