ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారత్​-ఆసీస్​ రెండో వన్డేలో నకిలీ టికెట్ల కలకలం.. పోలీసుల అదుపులో 15 మంది

FAKE TICKETS IN IND-AUS MATCH: ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్​ను చూడటానికి ఒడిశా నుంచి వచ్చిన కొందరు అభిమానులు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఎక్కువ రేట్లు పెట్టి మరీ టికెట్లు కొన్నా.. లోపలికి వెళ్లే సమయంలో దొరికిపోయారు. అసలు ఏం జరిగింది.. ఎందుకు వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటే..?

By

Published : Mar 20, 2023, 4:26 PM IST

Updated : Mar 20, 2023, 8:07 PM IST

FAKE TICKETS IN IND-AUS MATCH
FAKE TICKETS IN IND-AUS MATCH

FAKE TICKETS IN IND-AUS MATCH : క్రికెట్​ అంటే ఇష్టం లేని వారంటూ ఉండరూ. క్రికెట్​ మ్యాచ్​ చూడటం కోసం పనులు పూర్తి చేసుకుని మరీ టీవీలకు అతుక్కుపోతారు. మరీ అలాంటి క్రికెట్​ను స్టేడియంలో లైవ్​లో చూసే అవకాశం వస్తే ఎవరూ మాత్రం వదులుకుంటారు. రేటు ఎక్కువైనా సరే టికెట్లు కొనుక్కోని మరీ మ్యాచను వీక్షిస్తారు. ఇక్కడ కూడా మ్యాచ్​ చూడటానికి వచ్చిన కొందరు అభిమానులు ఇప్పుడు నానా తిప్పలు పడుతున్నారు. అదేంటి నిన్న మ్యాచ్​ జరిగితే.. ఇప్పుడు ఇబ్బందులు ఎందుకు అనుకుంటున్నారా..? పూర్తి కథనం చదివేయండి మరి..

నిన్న(మార్చి 19) విశాఖపట్నంలోని వైఎస్సార్​ స్టేడియంలో భారత్​-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్​ జరిగింది. దీనికోసం అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మ్యాచ్​ టికెట్లు హాట్​ కేకుల్లా అమ్ముడుపోయాయి. అందరిలాగే ఒడిశాకు చెందిన 15 మంది క్రికెట్​ అభిమానులు మ్యాచ్​ చూసేందుకు విశాఖకు వచ్చారు. అయితే టికెట్లు అయిపోవడంతో నిరాశ చెందారు. వెనక్కి వెళ్తున్న సమయంలో కొందరు బ్లాక్​లో టికెట్లు అమ్ముతుండగా గమనించి.. వారి వద్ద నుంచి అధికంగా డబ్బులు చెల్లించి టికెట్లు తీసుకున్నారు. టికెట్లు దొరికాయని ఆనందంగా ఉన్న సమయంలో.. వారికి ఓ చిక్కు ఎదురైంది.

బ్లాక్​లో టికెట్లు కొని మ్యాచ్​ చూడటానికి వెళ్తుండగా.. స్టేడియంలోకి వెళ్లే ఎంట్రీ గేట్​ వద్ద జరిగిన చెకింగ్​లో అవి నకీలీ టికెట్లు అని తేలాయి. ఇంకేముంది మ్యాచ్​ చూద్దామనుకున్న వారి ఆనందం ఆవిరైపోయింది. పైగా వారిని విశాఖ పీఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని విచారణ జరుపుతున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. స్టేడియం వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి.. అసలు ఒడిశా వాసులకు టిక్కెట్లు అమ్మిన వ్యక్తిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వ్యక్తిని కనిపెట్టి అతనికి నకిలీ టికెట్లు ఎలా వచ్చాయో ఆరా తీయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును వీలైనంత తొందరగా పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. విశాఖలోని వైఎస్సార్​ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో టీమ్ ఇండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆకాశమే హద్దుగా ఆడిన ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇండియా.. కంగారు బౌలర్ల ధాటికి 26 ఓవర్లు ఆడి కేవలం 117 పరుగులకే కుప్పకూలింది. భారత్​ బ్యాటర్లలో కోహ్లీ 31 పరుగులు చేయగా.. అక్షర్‌ పటేల్‌ 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే విజయం సాధించింది.

ఇవీ చదవండి:

Last Updated : Mar 20, 2023, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details