ఏప్రిల్ 7న ఆసుపత్రి సుధాకర్ విధులకు హాజరయ్యారు. ఆ రోజు సాయంత్రం అయ్యన్నపాత్రుడిని కలిశారనే వార్తలు రావటంతో... ఈ విషయాన్ని అధికారులు రాజకీయం చేసి మాస్కుల విషయం పక్కదారి పట్టించారని సుధాకర్ తల్లి కావేరీ బాయి తెలిపారు. అంబులెన్స్ డ్రైవర్‌తో సస్పెండ్ ఆర్డర్ పంపించినప్పటి నుంచి సుధాకర్ మానసిక క్షోభ అనుభవించాడని... అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేకపోయాడని అన్నారు.
ఓ వైద్యుడిని ఈ విధంగా ట్రీట్ చేయడం దారుణం. అరగంటలో వస్తానని చెప్పి వెళ్లిన మనిషిని మనసిక క్షోభ సరిగ్గాలేదనే ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ మనసులోని బాధను కనీసం కుటుంబీకులతో కూడా పంచుకోలేదని తెలిపారు. ఇదంతా పక్కా ప్రణాళికతోనే చేశారని వాపోయారు. నా బిడ్డ తిరిగి ఇంటికి రావాలి, ఉద్యోగం తిరిగి రావాలి, నా బిడ్డ విశాఖలోనే ఉండాలని కావేరీ బాయి అన్నారు.