విశాఖ జిల్లాకు సంబంధించి 98 పరపతి సంఘాలు ఉండగా... వీటికి 2013 ఫిబ్రవరిలో పాలకవర్గాలు ఎన్నికై బాధ్యతలు చేపట్టాయి. ఐదేళ్ల పాటు వీరు పదవిలో కొనసాగారు. 2018 ఫిబ్రవరితో వీరి పదవీ కాలం పూర్తయింది. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం రెండు పర్యాయాలు పదవీకాలాన్ని పొడిగించింది. తద్వారా వీరి పదవీకాలం 2020 జులై వరకు కొనసాగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
పీఏసీఎస్ పాలకవర్గాల పదవీ కాలం పొడిగింపు - visakha district latest news
రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పాలకవర్గ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అధ్యక్షులతో పాటు డైరెక్టర్లు 2021 జనవరి నెల వరకు పదవిలో కొనసాగే అవకాశం ఏర్పడింది.
పీఏసీఎస్ పాలకవర్గాల పదవీ కాలం పొడిగింపు