విశాఖ జిల్లా హుకుంపేట మండలం రాపపంచాయతీ ఈదులగరువులో గెమ్మెలి ఆంబే బాంబే అనే మహిళకు జ్వరం వచ్చింది. చాలా రోజులు అవుతున్నా.. జ్వరం తగ్గడం లేదు. అంబులెన్స్‌లో పాడేరు జిల్లా ఆస్పత్రికి ఆమెను తీసుకువెళ్లారు. ఐదు రోజులైంది అయినా మార్పు లేదు. పరీక్షల్లో రోగం గురించి తెలియలేదు. రోజురోజుకీ ఆమె నీరసించిపోతోందని.. దెయ్యం పట్టినట్టు ఉంటుందని కుటుంబసభ్యులు అనుమానించారు.
ఏజెన్సీ కొండల్లో పూజలు చేసే మంత్రసానిని ఏకంగా ఆసుపత్రికే తీసుకొచ్చారు. ఆ వార్డులో అందరూ చూస్తుండగానే.. ఆ భూత వైద్యురాలు రోగి నాడి పట్టుకుని మంత్రాలు చదివేసింది. తోటి రోగులు అందరూ చూస్తుండగానే భూత వైద్యం పూర్తి చేసింది. మహిళకు శాంతి శాంతి అంటూ సపర్యలు చేసింది. ఇదంతా... ఎదురుగా మందుల కౌంటర్లో నర్సులు చూస్తూనే ఉన్నారు. అదే సమయంలో పురుషుల వార్డులో... వైద్యులు రోగులను పరీక్షిస్తున్నారు.