ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

1140 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్టు - విశాఖ క్రైమ్​ వార్తలు

విశాఖలో గంజాయి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పెదబయలు మండలం మెట్ట వద్ద ఎక్సైజ్​ పోలీసుల తనిఖీల్లో ఓ వాహనంలో 1140 కిలోల గంజాయి బయటపడింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాహనాన్ని సీజ్​ చేశారు.

బొలెరో వాహనంలో 1140 కిలోల గంజాయి పట్టివేత
బొలెరో వాహనంలో 1140 కిలోల గంజాయి పట్టివేత

By

Published : Jun 8, 2020, 4:35 PM IST

విశాఖ జిల్లా పెదబయలు మండలం.. మెట్ట వద్ద బొలెరో వాహనంలో తరలిస్తున్న 1140 కిలోల గంజాయిని ఎక్సైజ్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్​ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఎక్సైజ్​ సర్కిల్​ ఇన్​స్పెక్టర్​ అనిల్​కుమార్​ తెలిపారు. గత వారంలో జిల్లా వ్యాప్తంగా మూడు వేల కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్నామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details