ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

విశాఖ ఏజెన్సీలోని నాటు సారా కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ దాడులు ముమ్మరం చేసింది. డుంబ్రిగూడ మండలంలో నాటుసారా కేంద్రాలపై దాడి చేసి బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

Excise officials' attacks on Natusara centers at vishaka distrct
నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

By

Published : May 12, 2020, 12:19 PM IST

విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం పాడి గ్రామ కొండల్లో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 2400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.

ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో పోలీసులకు వాలంటీర్లు, మహిళా పోలీసులు సాయం చేశారు. ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సీఐ కూర్మారావు, ఎస్సై రాజ్యలక్ష్మి దాడుల్లో పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details