ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు - visakha

గంజాయి నిర్మూలనకు అబ్కారీ అధికారులు నడుం బిగించారు. విశాఖ మన్యంలో గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

గంజాయి

By

Published : Jul 24, 2019, 4:54 PM IST

మన్యంలో అబ్కారీ అధికారుల అవగాహన

విశాఖ మన్యంలో గంజాయి నిర్మూలించాలని ఎక్సైజ్ అధికారులు గ్రామగ్రామాన అవగాహన కల్పిస్తున్నారు. గత వారంలో జిల్లా అధికారులతో కమిషనర్ ఎంఎం నాయక్ సమావేశం నిర్వహించి.. గంజాయి నిర్మూలనకు కార్యాచరణ రూపొందించారు. నాట్య కళాకారులతో అవగాహన కల్పిస్తున్నారు. గిరిజనులను ఓ చోట చేర్చి పాటలు, నృత్యాలతో ప్రదర్శనలు ఇస్తున్నారు. మన్యం నుంచి గంజాయిని శాశ్వతంగా నిర్మూలించాలనే తపనతో జి.మాడుగుల మండలం పరదనిపుట్టులో గంజాయిని పండించకుండా.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి గౌరవంగా జీవించవచ్చని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details