విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసు కానిస్టేబుల్ కరోనా సోకి మృతి చెందినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పెద్ద బొడ్డేపల్లి గ్రామానికి చెందిన 34 ఏళ్ల యువకుడు ఎక్సైజ్ పోలీసు విభాగంలో మొబైల్ టీంలలో విధులు నిర్వహిస్తున్నాడు. వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధరణ కావడంతో అతన్ని విశాఖ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎక్సైజ్ శాఖ అధికారుల వెల్లడించారు. దీంతో నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో కరోనా పాజిటివ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 4కు చేరింది. తాజా మృతితో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కరోనా సోకి ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి - నర్సీపట్నం తాజా కరోనా వార్తలు
కరోనాతో నర్సీపట్నం ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి చెందినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. దీంతో వైద్యం కోసం విశాఖకు తీసుకెళ్లారు. గురువారం అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
కరోనాతో మృతి చెందిన 34 ఏళ్ల ఎక్సైజ్ కానిస్టేబుల్