విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం... కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తోంది. వసతి గృహాల ఏర్పాటుతోపాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల నిర్వహణలో సమస్యలు తలెత్తకుండా సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగిస్తున్నారు. వెబ్సైట్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉపకులపతి పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు .
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ - ఆంధ్ర విశ్వవిద్యాలయం తాజా వార్తలు
కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. వైరస్ భయంతో విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రవిశ్వవిద్యావయం పరిధిలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి పీవీజీడీ ప్రసాదరెడ్డి తెలిపారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపలి పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి