విశాఖ జిల్లా మాడుగుల మండలం కే.జే.పురం గ్రామంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, తెదేపా నేత బొడ్డేడ రామారావు (80) ఆనారోగ్యంతో శుక్రవారం ఆసుపత్రిలో మృతి చెందారు. శనివారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన పార్థివదేహానికి మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ, మాడుగుల, చోడవరం, అనకాపల్లి నియోజకవర్గాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, పలువురు నివాళులు అర్పించారు. రామారావుకి కుమారులు లేకపోవడం వల్ల ఆయన అల్లుడు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించారు.
జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొడ్డేడ రామారావు అంత్యక్రియలు - tdp leader boddeeti ramarao funeral latest news
విశాఖ జిల్లా మాడుగుల మండలం కే.జే.పురంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, తెదేపా నేత బొడ్డేడ రామారావు అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, తెదేపా నేత బొడ్డేడ రామారావు అంత్యక్రియలు