విశాఖలో హిడెన్ స్పాట్ మానసిక వికలాంగుల పాఠశాల కూల్చివేయడం దారుణమని మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ (MSK Prasad) అన్నారు. సుమారు 140 మంది మానసిక వికలాంగుల చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలను బలవంతంగా నగరపాలక సంస్థ అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల నిర్వాహకుడు తన జీవితాన్నే వికలాంగ చిన్నారుల కోసం త్యాగం చేశారని...అలాంటి వారికి అందరూ చేయూతనివ్వాలని ఎంఎస్కే ప్రసాద్ (MSK Prasad) కోరారు. ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకోని ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని సూచించారు..
msk prasad: విశాఖలో హిడెన్ మానసిక వికలాంగుల పాఠశాల కూల్చడం దారుణం: ఎమ్మెస్కే - విశాఖ హిడెన్ స్పాట్ మానసిక వికలాంగుల
విశాఖలో హిడెన్ మానసిక వికలాంగుల పాఠశాల కూల్చడం దారుణమని మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని సూచించారు.
msk prasad