ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరిశోధనలపై దృష్టిపెడితే మంచి ఫలితాలు వస్తాయి' - 'పరిశోధనలపై దృష్టిపెడితే మంచి ఫలితాలు వస్తాయి'

దేశంలో ప్రతిభకు కొరత లేదని.. మన విశ్వవిద్యాలయాల్లో ఓనమాలు దిద్దుకుని విదేశాల్లో స్దిరపడిన వారు నోబెల్ సాధిస్తున్నారని, భారత్ మాత్రం దాదాపుగా వందేళ్లుగా నోబెల్ కోసం నిరీక్షించాల్సి వస్తున్న అంశం కొంత నిరాశ కలిగిస్తోందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పరిశోధనలపై దృష్టిపెడితే మంచి ఫలితాలు వస్తాయని గీతం సంస్ధల వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన అన్నారు.

'పరిశోధనలపై దృష్టిపెడితే మంచి ఫలితాలు వస్తాయి'

By

Published : Aug 10, 2019, 11:58 PM IST

'పరిశోధనలపై దృష్టిపెడితే మంచి ఫలితాలు వస్తాయి'

విశాఖలోని గీతం సంస్ధల 39 వ వ్యవస్దాపక దినోత్సవంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. గీతం వ్యవస్థాపకుడు,దివంగత ఎం.వి.వి.ఎస్.మూర్తి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.ప్రణబ్కి గీతం వ్యవస్థాపక అవార్డ్ను గీతం సంస్థల అధ్యక్షుడుశ్రీ భరత్ అందించారు. అవార్డ్ కింద 10 లక్షల నగదు, ప్రశంసా పత్రం ప్రణబ్కి అందించారు. విద్యార్థిని, విద్యార్థులకు, అధ్యాపకులు, సిబ్బందిని గీతం యాజమాన్యం సత్కరించింది. దేశంలో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్ధలు పరిశోధనల పట్ల పూర్తి స్ధాయిలో దృష్టిపెడితే మంచి ఫలితాలు వస్తాయని ప్రణబ్​ ఆశాభావం వ్యక్తం చేశారు.మనకున్న జనాభా లో యువతరం ఎక్కువశాతం ఉండడం మనకు ఎంతోప్రయోజనకరమన్నారు. రానున్న 20 ఏళ్లలో ప్రపంచంలోని వంద విశ్వవిద్యాలయాల్లో చోటు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని గీతం సంస్ధల అధ్యక్షుడు శ్రీభరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధినీ విద్యార్ధులసాంస్కృతిక ప్రదర్శనలు అహుతులను ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details