ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వ్యాక్సిన్​ వేయించుకున్న భాజపా నేత హరిబాబు - మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు తాజా వ్యాఖ్యలు

వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి కరోనా నిబంధనలు పాటించాలని మాజీ ఎంపీ హరి బాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 60 సంవత్సరాలు పైబడిన వారి జాబితాలో పేరు నమోదు చేసుకున్న ఆయన కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

BJP leader Haribabu was vaccinated
కరోనా వ్యాక్సిన్​ వేయించుకున్న భాజపా నేత హరిబాబు

By

Published : Mar 4, 2021, 2:03 PM IST

భాజపా నేత, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 60 సంవత్సరాలు పైబడిన వారి జాబితాలో పేరు నమోదు చేసుకున్న ఆయన వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రావని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ చొరవతో భారత శాస్త్రవేత్తలు అతి తక్కువ వ్యవధిలో కరోనాను నిలువరించేందుకు వ్యాక్సిన్ కనుగొని.. అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. దేశంలో తయారైన ఈ వ్యాక్సిన్ ని 50 దేశాలకు పైగా అందిస్తున్నామని, ఇది భారత శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మైథిలి, డాక్టర్ విజయ్ శంకర్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వైద్య విభాగం కన్వీనర్ ఆర్. రవికుమార్ పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details