ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు' - tdp fires on ysrcp

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టిందని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికిి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు.

ex mla rama naidu on ysrcp government
వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతలు

By

Published : Jul 11, 2020, 6:17 PM IST

వైకాపా ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. తెదేపాపై కక్ష సాధింపు వైఖరితోనే పనిచేస్తుందని రామానాయుడు విశాఖ జిల్లా చీడికాడలో విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం పక్కనపెట్టి.. ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆరరోపించారు.

గతంలో మంజూరు చేసిన పేదల పక్కా ఇళ్లకు బిల్లులు మంజూరు చేయలేదని రామానాయుడు చెప్పారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఆదరణ పథకంలో పరికరాలను కూడా మంజూరైనా.. పూర్తిస్థాయిలో ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన పై దృష్టి సారించాలని రామానాయుడు కోరారు.

ABOUT THE AUTHOR

...view details