కె. కోటపాడు మండలం మేడిచర్లలో మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత పూడి మంగపతిరావు ఈ మధ్యే మరణించారు. శనివారం ఆయన స్వగ్రామంలో తెదేపా నాయకులు సంతాప సభ నిర్వహించారు. మాజీ మంత్రులు అయన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ, మాజీ ఎంపీ సబ్బం హరి, మాడుగుల నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పలువురు నేతలు హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.
'తెదేపాకు మంగపతిరావు చేసిన సేవలు ఎనలేనివి' - తెదేపా నేత పూడి మంగపతిరావు తాజా వార్తలు
మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత పూడి మంగపతిరావు మరణంపై పార్టీ నేతలు సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. కార్యక్రమానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు హాజరై సంతాపం తెలిపారు.
!['తెదేపాకు మంగపతిరావు చేసిన సేవలు ఎనలేనివి' ex mla mangapathi rao mourning attended by tdp members](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8951010-1028-8951010-1601130268161.jpg)
లుగుదేశం పార్టీ నేత పూడి మంగపతిరావు సంతాప సభ