విశాఖ జిల్లాలో కరోనా కేసుల వివరాలను వెల్లడించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. అనకాపల్లి నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ వివరాలు చెప్పకపోవడం వల్ల అయోమయం నెలకొందన్నారు. వివరాలు వెల్లడించి ప్రజలను అప్రమత్తం చేయాల్సింది పోయి గోప్యంగా ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కసింకోట మండలంలో ఒక వృద్ధురాలికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్ధరించినా అధికారికంగా ప్రకటించకపోవడం దారుణమన్నారు.
'విశాఖ జిల్లాలో పాజిటివ్ కేసుల వివరాలను వెల్లడించండి' - latest news of vizag corona cases
విశాఖ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల వివరాలు వెల్లడించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ విమర్శించారు. ఓ వృద్ధురాలికి వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధరించినా....ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదని అరోపించారు.

విశాఖలో పాజిటీవ్ కేసుల వివరణ ఇవ్వండి
ఇదీ చూడండి కరోనా సవాళ్లను అవకాశాలుగా మలుచుకుందాం'