ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో బాధితులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తే, వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకోవడాన్ని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. బాధితులు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధలో ఉంటే ఇదేం పని అని ప్రశ్నించారు.
వైకాపా ఎమ్మెల్యే చొరవతో పరిహారం వచ్చిందని పాలాభిషేకాలు చేసుకోవడం.. ఆ పార్టీ నేతలకు సిగ్గు చేటు అని విమర్శించారు. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించిన 94వ వార్డు వైకాపా కార్యకర్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.