తిరుమల పవిత్రతను, సంప్రదాయాలను కొందరు దెబ్బతీయాలని చూస్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం తిరుమలను అప్రతిష్ఠ పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి జగన్కు బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే హక్కు లేదని బండారు వ్యాఖ్యానించారు. గత బ్రహ్మోత్సవాల్లో జగన్ సతీసమేతంగా ఉత్సవాలకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ఈ ఏడాది కూడా సీఎం జగన్ ఒంటరిగా వస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. అలాగే సీఎం జగన్ కూడా తిరుమల కొండకు వచ్చినపుడు డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూ ధర్మం దెబ్బతింటున్నా... శారదాపీఠం స్వామి మౌనం వహిస్తున్నారెందుకని బండారు సత్యనారాయణ ప్రశ్నించారు.