ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేతనైతే మీ నేతను లైవ్​లోకి తీసుకురావాలి: అయ్యన్నపాత్రుడు - Ayyannapatrudu latest news

తెదేపా నేతలపై వాలంటీర్లని పెట్టి గెలిపిస్తానని జోగి రమేశ్ అంటుంటే.. పులివెందుల పిల్లి తెదేపా ఎమ్మెల్యేకు ఎందుకు వైకాపా కండువా కప్పుతోందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు నిలదీశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జగన్ చేసిన పదవిన్యాసం ఇంకా మర్చిపోలేకపోతున్నామని అయ్యన్న ఎద్దేవా చేశారు.

Ex minister Ayyannapatrudu fires on jogi Ramesh over comments on Lokesh
అయ్యన్నపాత్రుడు

By

Published : Aug 22, 2020, 3:03 AM IST

అయ్యన్నపాత్రుడి ట్వీట్

జగన్​కి దమ్ముంటే పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించి వాలంటీర్లని పోటీలో పెట్టాలని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు సవాల్ చేశారు. పులివెందుల పిల్లిని పోటీకి దింపినా సరేనంటూ... జోగి రమేష్ చేసిన సవాల్​పై ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం నేతలపై వాలంటీర్లని పెట్టి గెలిపిస్తానని జోగి రమేశ్ అంటుంటే.. పులివెందుల పిల్లి తెదేపా ఎమ్మెల్యేకు ఎందుకు వైకాపా కండువా కప్పుతోందని నిలదీశారు. చేతనైతే గన్నేరుపప్పుని లైవ్​లోకి తీసుకురావాలని... అప్పుడు ఎవడి సత్తా ఏంటో తేలిపోతుందని స్పష్టం చేశారు. తెలుగుకి తెగులు పట్టిస్తూ స్వాతంత్ర్య దినోత్సవం రోజున జగన్ చేసిన పదవిన్యాసం ఇంకా మర్చిపోలేకపోతున్నామని అయ్యన్న ఎద్దేవా చేశారు. ముందు జగన్​కి (అ,ఆ)లు నేర్పాలని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details