కరోనా నియంత్రణ పట్ల ఆరోగ్య శాఖ మంత్రితో పాటు సీఎం జగన్‌కు అవగాహన లేదని... తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ముఖ్యమంత్రి ఎవరి మాటా వినకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. ప్రజలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగులకు 100 శాతం పింఛను ఇవ్వాలన్న ఆయన... రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు నష్టపోతారు: అయ్యన్న - ఏపీలో కరోనా కేసులు
కరోనా నియంత్రణపై ప్రభుత్వం అవగాహన లేకుండా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలు తీవ్ర స్థాయిలో నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
![ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు నష్టపోతారు: అయ్యన్న ex-minister-ayyannapathrudu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6911684-861-6911684-1587651285678.jpg)
ex-minister-ayyannapathrudu