ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా అని ఇష్టానుసారం రాజధానిని మార్చుతాననడం మంచి పద్ధతి కాదని... తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదన్న ఆయన... దానికి అభివృద్ధిలో వెనుకబడిన దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకోవడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ 'నా మాటే నెగ్గాలనే' మంకుపట్టు మాని.. రాష్ట్రం బాగుకోరే మేధావులు, ప్రముఖులు, అనుభవజ్ఞులతో చర్చించి మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
'సీఎం అయితే ఇష్టానుసారం చేస్తారా...!' - మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. సీఎం అయితే మాత్రం ఇష్టానుసారం రాజధానిని మార్చుతాననడం పద్ధతి కాదని విమర్శించారు.
ex-minister-ayyanna-patrudu-comments-on-capital