EX MINISTER AVANTHI: ఉండటానికి ఇల్లు లేదని.. ఇంటి స్థలం కూడా మంజూరు కాలేదని.. తాను ఏ చెట్టుకింద ఉండాలంటూ ఓ మహిళ అడిగిన ప్రశ్నకు.. మాజీ మంత్రి అవంతి ఖంగుతిన్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం వేములవలసలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అవంతి శ్రీనివాసరావు పర్యటించారు. ఇళ్ల సమస్యపై స్థానికులు ప్రశ్నించారు. తనకు ఇంటి స్థలం కూడా రాలేదని మహిళ నిలదీయగా..డబ్బులిస్తున్నాం కదా అని అవంతి సమాధానమిచ్చారు. నిలవనీడలేకుండా డబ్బులిస్తే ఏం చేసుకోవాలని ప్రశ్నించింది. ఇళ్లపై కోర్టు కేసులున్నాయని..ఇది కాకుండా మరేమైనా ఉంటే చెప్పండని సూచించారు. వేములవలస ప్రజలకు ఇవ్వడానికి కోర్టులో పరిధిలో ఉన్న భూమి ఒక్కటే ఉందా అని మరో వ్యక్తి నిలదీశారు. చేసేదేమీలేక మాజీమంత్రి అవంతి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
"ఇల్లు లేదు, ఇంటి స్థలం లేదు..ఏ చెట్టుకింద ఉండాలి" మాజీ మంత్రి అవంతిపై మహిళ ఆగ్రహం - మాజీ మంత్రి అవంతిపై మహిళ ఆగ్రహం
EX MINISTER AVANTHI: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొంటున్న వైకాపా ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక నీళ్లు నములుతున్నారు. తాజాగా విశాఖ జిల్లా వేములవలసలో మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు పర్యటించారు. అందులో భాగంగా ఓ మహిళ అడిగిన ప్రశ్నకు ఆయన ఖంగుతిన్నారు.
!["ఇల్లు లేదు, ఇంటి స్థలం లేదు..ఏ చెట్టుకింద ఉండాలి" మాజీ మంత్రి అవంతిపై మహిళ ఆగ్రహం EX MINISTER AVANTHI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15926032-999-15926032-1658815470246.jpg)
EX MINISTER AVANTHI
మాజీ మంత్రి అవంతిపై మహిళ ఆగ్రహం