ఎమ్మెల్సీ తనయుడి వివాహానికి హాజరైన చంద్రబాబు - ఎమ్మెల్సీ తనయుడి వివాహానికి హాజరైన చంద్రబాబు
ప్రస్తుతం విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు గురువారం రాత్రి అనకాపల్లికి వచ్చారు. తెదేపా ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు తనయుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు కుమారుడి వివాహానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని రావు గోపాలరావు కళాక్షేత్రంలో నిర్వహించిన వివాహ వేడుకలకు చంద్రబాబునాయుడు హాజరై వధూవరులు ప్రియాంక, ప్రసాద్‌ను ఆశీర్వదించారు. ఈ వేడుకకు శాసనమండలి ఛైర్మన్ షరీఫ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీలు పప్పల చలపతిరావు, అశోక్ బాబు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు అనకాపల్లి వచ్చిన చంద్రబాబుకి తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
TAGGED:
chandrababu in anakapalli