ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శిరోముండనం కేసులో ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు' - శిరోముండనం కేసులో ఎవ్వరిని వదిలిపెట్టమన్న మంత్రి అవంతి

దళితుడిపై సినీ నిర్మాత నూతన నాయుడి కుటుంబం చేసిన చర్యను విశాఖ జిల్లాలో... ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. బాధితుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని పలువురు నేతలు తెలిపారు. శిరోముండనం కేసులో ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని మంత్రి అవంతి అన్నారు.

everybody who is involved in vishaka head tonsure case will be punished says political leaders
'శిరోముండనం కేసులో ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు'

By

Published : Aug 31, 2020, 8:11 PM IST

విశాఖలో దళితుడిపై సినీ నిర్మాత నూతన నాయుడి కుటుంబం చేసిన చర్యను జిల్లాలో ప్రజా ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. బాధితుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు అండగా నిలుస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

నూతన నాయుడు కుటుంబ హింసకు, వారి చేతిలో శిరోముండనానికి గురైన బాధితుని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ సైతం ఈ వ్యవహారంలో ఎవ్వరిని వదిలిపెట్టకూడదని ఆదేశాలు ఇచ్చారని ఆయన తెలిపారు. పోలీసులు కేవలం ప్రధాన నిందితులను అరెస్టు చేసి చర్యలు తీసుకున్నారని... ఇకపై ఎస్సీలపై ఇలాంటి చర్యలేవి జరగకుండా బుద్ధి చెప్పాలని పలువురు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details