చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం కోలుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీని పారదర్శకంగా అమలు చేసి.... మరిన్ని ఉద్దీపనలు ప్రకటించాలని భారత పరిశ్రమల సమాఖ్య జాతీయ కౌన్సిల్ సభ్యుడు శివ కుమార్ అభిప్రాయపడ్డారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు కోలుకునేందుకు.. తమ తమ కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు... ఇప్పటికే ఉన్న వివిధ పన్నుల నుంచి వాటాను ఇవ్వాలన్నారు.
ప్యాకేజీ మొత్తం పరిశ్రమలకు అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా ప్రకటించడం కూడా ఒక మంచి పరిణామంగా ఆయన చెప్పారు. భారీ పరిశ్రమల రంగం పురోగతిపైనే ఈ రంగం భవిష్యత్తు ఆధారపడి ఉందని చెబుతున్న శివ కుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.