విశాఖలో ఎల్జీ పాలీమర్స్ ఘటనలో బాధితులు జంకుతూనే ఉన్నారు. గ్రామాల్లో ప్రజలంతా పూర్తి జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యాదికారి తిరుపతిరావు సూచిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ సమీప గ్రామాలలో ప్రమాదం సమయంలో వచ్చిన రసాయన వాయువు ఉండటం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. గ్రామస్థులు తలుపులు తెరిచి ఉంచాలని..ఇంట్లో వస్త్రాలన్నీ పూర్తిగా ఉతికిన తరువాత వేసుకోవాలని తెలిపారు. రసాయన వాయువు ప్రభావం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని వెల్లడించారు. బాధితులకు ఆక్సిజన్ థెరపీ చేయిస్తున్నామన్నారు. బాధిత గ్రామాల్లో ప్రత్యేక వైద్యటీమ్లు... వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామంటున్న విశాఖ జిల్లా వైద్యాధికారి తిరుపతిరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'ఇంటి తలుపులు తెరిచే ఉంచాలి'
విశాఖలో ఎల్జీ పాలీమర్స్ ఘటనలో బాధితులు ఇంకా కోలుకోలేదు. రేపు ఏమవుతుందోనన్న భయం వెంటాడుతోంది. రసాయన వాయువు ప్రభావం ఇంకా ఇళ్లలోనే ఉండేసరికి ఊపిరి ఎలా తీసుకోవాలోనని జంకుతున్నారు. ఇదిలావుంటే ప్రభుత్వం మాత్రం ఊర్లోకి వచ్చి ఉండాలని..తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
విశాఖ జిల్లా వైద్యాధికారితో ఈటీవీ భారత్ ముఖాముఖి