ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా లాంటి కష్టం మరెవరికీ రాకూడదు' - వెంకటాపురం వైద్య విద్యార్థి చంద్రమౌళి వార్తలు

కుమారుడిని వైద్యుడిని చేయాలని కలలు కన్నారు. మంచి చదువు చెప్పిస్తున్నారు. కానీ.. ఎల్​జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ రూపంలో వచ్చిన మృత్యువు.. తమ కుమారుడిని ఇలా కబళిస్తుందని వారు ఊహించలేకపోయారు. ఆ తీరని విషాదాన్ని మరిచిపోలేక కుమిలి కుమిలి.. కన్నీటి పర్యంతమవుతున్నారు.

etv bharat interview with   medico student chandramouli family in venkatapuram
మెడికో విద్యార్థి చంద్రమౌలి కుటుంబంతో ఈటీవీ భారత్ ఇంటర్వ్యూ

By

Published : May 26, 2020, 7:43 AM IST

మెడికో చంద్రమౌళి తల్లిదండ్రులతో ముఖాముఖి

విశాఖ ఎల్జీ పాలీమర్స్ విషవాయువు ఘటన ఆర్​ఆర్. వెంకటాపురం గ్రామస్తుల్లో తీరని విషాదం నింపింది. ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థి చంద్రమౌళి తల్లిదండ్రులు కుమారుడిని తలుచుకుని కన్నీరు మున్నీరయ్యారు. తండ్రి అన్నెపు ఈశ్వరరావు హెడ్ కానిస్టేబుల్​గా జీవనం సాగిస్తూ.. కుమారుడిని వైద్యుడిగా చూడాలని కలలు కన్నాడు.

కానీ.. ఎల్జీ పాలిమర్స్ రూపంలో భగవంతుడు ఇలా తమ కుమారుడిని తీసుకెళ్లిపోయాడని... ఈ కష్టం మరెవరికీ రాకూడదని మెడికో చంద్రమౌళి తల్లితండ్రులు విలపించారు. తమ కుమారుడు డాక్టర్‌ కావాలని నిరంతరం కష్టపడేవాడని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమైన చంద్రమౌళి తల్లిదండ్రులతో ఈటీవీ భారత్ ప్రతినిధి ఆదిత్యపవన్‌ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details