ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాఫీ గింజల సేకరణపై జీసీసీ మేనేజర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి - పాడేరులో కాఫీ గింజలు

కాఫీ గింజల సేకరణ, అమ్మకాలు, విక్రయాలపై విశాఖ జిల్లా పాడేరులో గిరిజన సహకార సంస్థ జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ ఈటీవీ భారత్​ ముఖాముఖిలో మాట్లాడారు.ఈ ఏడాది రెండు వేల క్వింటాళ్ల కాఫీ కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

etv bharat interview with   GCC manager on coffee seeds collection
కాఫీ గింజల సేకరణపై జీసీాసీ మేనేజర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

By

Published : Mar 11, 2020, 6:03 PM IST

కాఫీ దిగుబడులు, నాణ్యత, రుణాలు,అమ్మకాలు, విక్రయాలపై ఈటీవీభారత్​ ముఖాముఖిలో గిరిజన సహకార సంస్థ జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ మాట్లాడారు. విశాఖ జిల్లా పాడేరులో ఆయన పర్యటించి....సహకార సంస్థ సంస్థ బ్రాంచ్ మేనేజర్లు, క్షేత్ర సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఏజెన్సీలో కాఫీ సేకరణ ఈ ఏడాది ఆశాజనకంగా లేదని దీంతో అనుకున్న ఆశయానికి చేరుకోలేకపోయామని జీఎం చెప్పారు. గత ఏడాది 1050 క్వింటాళ్ల వరకు కాఫీ కొనుగోలు చేశామని ...ఈ ఏడాది 100 క్వింటాళ్ల కాఫీ కూడా కొనుగోలేదని అన్నారు. తక్కువ దిగుబడి రావడం, ప్రైవేట్ సంస్థలు కొనుగోళ్లతో ఈ పరిస్థితి ఎదురైందని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో తెలిపారు ఏజెన్సీలో దళారీ వ్యవస్థను నియంత్రించేందుకే వ్యవసాయ అటవీ ఉత్పత్తులను సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్నామన్నారు. ఐటీడీఏ ద్వారా రుణాలు మంజూరు చేయడం, కాఫీ పంటలను ప్రోత్సహించడం చేస్తున్నామన్నారు. ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు తమ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసిందని దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది రెండు వేల క్వింటాళ్ల కాఫీ కొనుగోలుకు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు.

కాఫీ గింజల సేకరణపై జీసీాసీ మేనేజర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details